బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రధాన కార్యాలయానికి సోమవారం ఇ మొయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో డాగ్‌స్కాడ్, బాంబు డిటెక్షన్ డిస్సోజల్ బృందాలు కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల క్రితమే ఇస్రోకు ఇదే విధమైన బెదిరింపు వెలువడింది. విస్తృత సోదాల తరువాత ఈ బెదిరింపు ఉత్తుత్తిదే అని తేలింది. దీనితో ఇస్రో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.