కడప జిల్లా పులివెందుల ముదునూరు రింగ్ రోడ్డు టర్నింగ్ వద్దదాదాపు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు స్పీడ్ బ్రేకర్ దాటుతున్న సమయంలో మొదట ఒక టైరు ఊడిపోయింది. ఆ వెంటనే కొద్ది క్షణాల్లోనే రెండో టైరు కూడా ఊడిపోవడంతో బస్సు ఒక వైపుకు ఒరిగిపోయింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. విద్యార్థుల హాహాకారాలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారిపోయింది. డ్రైవర్ తక్షణమే బ్రేక్ వేసి బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.