మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి ఫోక్సో కేసు నిందితుడి పారిపోయాడు. అమర్ చింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున జైలు గోడ దూకి పరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జైలు అధికారులు గోప్యంగా ఉంచారు. కిషోర్ కుమార్ రెడ్డి ఫోక్సో కేసులో నిందితుడుగా జైలులో ఉన్నారు. ఈ వ్యవహారంపై జైలర్ శాఖ డిఐజి మహబూబ్ నగర్ చేరుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడు జైలు నుంచి పరారీ కావడం జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.