రాష్ట్ర హోంశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి మరోసారి కొలువుల జాతర మొదలైంది. మొత్తం 7,437 పోస్టులను ప్రత్యక్ష నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తూ అధికారికంగా జీవోలు విడుదల చేసింది. ఈ మెగా రిక్రూట్‌మెంట్‌లో భాగంగా కేవలం పోలీసు శాఖలోనే కాకుండా, అనుబంధ విభాగాలైన అగ్నిమాపక విపత్తు నిర్వహణ, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళంలోని ఎస్సై, కానిస్టేబుల్, ఇతర సమానమైన పోస్టులను భర్తీ చేయనున్నారు.