కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టుగా ఏదైనా ప్రమాదం జరిగితే తాము బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేసుకుంటామని తెలిపారు. అలాగే, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి మంత్రివర్గం నాటకం ఆడుతుంది’’ అని జగదీష్ రెడ్డి విమర్శించారు.