ఫాతిమా కళాశాల అంశాన్ని తెరపైకి తెచ్చి తమను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాము ఎలాంటి అక్రమాలకు లేదా అవినీతికి పాల్పడలేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. విద్యాసంస్థలను కూల్చివేస్తామంటూ వస్తున్న బెదిరింపులకు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, తమ సంస్థలను ఎలా రక్షించుకోవాలో తమకు బాగా తెలుసని హెచ్చరించారు. “మాదొక్క విద్యాసంస్థను కూల్చేస్తే.. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మరో వంద విద్యాసంస్థలను నిర్మించి చూపిస్తాం” అని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.