భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘనంగా అడుగుపెట్టారు. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే, ఆ దేశ ఎయిర్ ఫోర్స్ జెట్స్ విమానాలు ఆయనకు గౌరవ సూచకంగా ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ అద్భుతమైన స్వాగతం రెండు దేశాల మధ్య ఉన్న దృఢమైన దౌత్య సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. జకార్తా విమానాశ్రయంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్వయంగా విచ్చేసి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.

