విజయవాడకు వేలాదిగా తరలి వచ్చిన సచివాలయ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్యోగులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.సచివాలయ ఉద్యోగుల ఆందోళనపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి స్పందించారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో సంకీర్ణ ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. సిబ్బంది రెగ్యులరైజేషన్, వారికి కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. త్వరలో కొత్త పీఆర్సీ కమిషన్ వేయబోతున్నామని ప్రకటించారు.