బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరిగి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూనే.. ఎవరు ఏం చేస్తున్నారో తమకు తెలుసని చెప్పారు. అధికారం లోకి రాగానే అన్ని లెక్కలు బయటికి తీస్తామని హెచ్చరించారు.హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్ ప్రెస్‌మీట్ పెట్టి ఏ పాట పెట్టాలి.. ఏ పాట పెట్టొద్దు అని మాట్లాడుతున్నారు. శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసులు డీజేలు బంద్ చేయిస్తున్నరు. అణిచివేత ఎక్కువైతే సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి.