ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ క్రీడాకారిణి అనాహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో మలేషియాకు చెందిన శివశంగరి సుబ్రహ్మణ్యం చేతిలో ఓటమి ఎదురైనా.. అనాహత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.అనాహత్ సింగ్ 4-11, 4-11, 7-11 తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్లో ఓడినప్పటికీ.. ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించడం ద్వారా అనాహత్ సింగ్ భారత స్క్వాష్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.