సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులను కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు.