రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన ‘సీడ్ యాక్సెస్ రోడ్డు’ పనులకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి.
సీఆర్డీఏ పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ భూసేకరణ విషయంలో అధికారులు చట్ట నిబంధనలను ఏమాత్రం అనుసరించలేదని ఆరోపిస్తూ పలువురు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది రాజధాని నిర్మాణంలో భాగమని, ఇది విస్తృత ప్రజానీకం ప్రయోజనాలతో ముడిపడి ఉందని కోర్టు అభిప్రాయపడింది.