భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. ముంబయి, దిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ నుంచి వచ్చే విమానాలపై ప్రభావం పడింది. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో కొన్ని విమానాలకు తాత్కాలికంగా అనుమతి నిరాకరించారు. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

