వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ అయ్యారు. గుంటూరులోని ఇంటికి వెళ్లి నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇస్తామని పోలీసులు చెప్పారని నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ పోలీసులం అంటూ అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు.