వారం క్రితం ఉజ్బెకిస్థాన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న సావారియా బసంత్‌ను ఆమెతో పాటే చదువుకుంటున్న విద్యార్థి సదరుల్ అనమ్ ల్యాప్‌టాప్‌తో ఆమె తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు, ఈ హత్యకు మతమార్పిడి కోణం ఉందని సవారియా కుటుంబం ఆరోపిస్తోంది. మతమార్పిడికి పాల్పడాలని ఒత్తిడి చేసి.. తమ బిడ్డను చిత్రహింసకు గురి చేసి చంపారని వారు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బసంత్ హత్యపై సమగ్ర విచారణ కోరుతున్న ఆమె కుటుంబసభ్యులు జిల్లా ఎస్పీ, అధికారులను కలిశారు.

