ఒక మలయాళ నటి దాడి మరియు దోపిడీ కేసుగా మొదలైన ఈ వ్యవహారం, ప్రస్తుతం ఈ వైద్యుడిపైనే అత్యాచారం కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం, శుక్రవారం నుంచే అతను పరారీలో ఉన్నాడు. ఈ కేసులో కీలక పురోగతిగా, సదరు వైద్యుడి మొబైల్ ఫోన్ నుండి 10 మందికి పైగా మహిళలకు సంబంధించిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యం కోసం ఆశ్రయించిన మహిళలకు మత్తు పదార్థాలను ఇచ్చి, ఆ తర్వాత మహిళలపై లైంగిక దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.