పరిషత్ పోరులో పలువురు అభ్యర్థులు అత్యధిక మెజార్టీలతో ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పమిడిపాటి శ్రీనివాసరావు 30,273 ఓట్ల మెజార్టీతో సత్తాచాటారు. క్రోసూరు మండలంలో మొత్తం 38వేల ఓట్లు పోలవ్వగా సమీప ప్రత్యర్థిపై రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.