వైఎస్సార్సీపీ MLC అప్పిరెడ్డి అక్రమ అరెస్టును, నిర్బంధాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను ఎవరి ఆదేశాలమేరకు బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది?స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.