ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద పేలుడు కలకలం రేపింది. వసుంధర పోలీస్ అవుట్‌పోస్ట్‌లో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో సంభవించిన ఈ ఘటనలో రెండు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరికీ గాయాలు కాలేదు. పేలుడు తర్వాత ‘ఘాజీ 2’ అనే ఎక్స్ ఖాతాలో ‘తహ్రీక్-ఉల్-ముజాహిదీన్ హిందుస్థాన్’ పేరుతో బాధ్యత ప్రకటిస్తూ పోస్టు వచ్చింది. పోలీస్ అవుట్‌పోస్ట్‌ను పేల్చివేస్తామంటూ హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ ప్రకటన నిజమైనదా కాదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.