కమల్ హసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక అనేక విభాగాల్లో కూడా కనిపించనారంభించింది. నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం, రచన, కథా సంవిధానం, సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించాడు. నటనలో విభిన్న పాత్రలెన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించాడు. మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కళైమామణి బిరుదుతో సత్కరించింది.