మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ప్రతిపక్ష పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భారతి ఘన విజయం సాధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన లెక్కింపులో వైసీపీ అభ్యర్థి సావిత్రిపై భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. వైసీపీకి పట్టున్న కంచుకోటగా భావించే పులివెందులలో కూటమి గెలుపొందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.