ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల తనకు ఉదర భాగంలో (అబ్డామినల్) విజయవంతంగా సర్జరీ జరిగినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తాను వేగంగా కోలుకుంటున్నానని స్పష్టం చేశారు. ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫొటోను పంచుకున్న షర్మిల.. తన ఆరోగ్యం పట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.