నర్సంపేట మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారని రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డా సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ మీడియాతో మాట్లడారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఇంట్లో గుండెపోటుతో కిందపడిపోయారని, వెంటనే అతడిని రోహిణి ఆస్పత్రి తీసుకొచ్చారని పేర్కొన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని, ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రి తరలిస్తామని వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని కోరారు.

