గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను అదరగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది. 48కేజీల మహిళల విభాగంలో మీరాబాయి రికార్డు స్థాయి ప్రదర్శన చేసి భారత్కు స్వర్ణ పతకం సాధించి పెట్టింది. దీంతో వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్లలో స్వర్ణ పతకాలు సాధించి మీరాబాయి చాను ‘గోల్డెన్ హ్యాట్రిక్’ కొట్టింది. స్నాచ్ లో ఆమె 85 కేజీల బరువు ఎత్తి రికార్డుల్లోకెక్కింది. కామన్వెల్త్లో మహిళా విభాగంలో ఇదే అత్యధిక బరువు కావడం విశేషం.