ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న నారా లోకేష్ కూడా నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలని స్పష్టం చేశారు.