విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైడి రాజు బుధవారం చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. ఈ నెల 8న సాయంత్రం విశాఖ ప్లాంట్లో ఉక్కు ద్రవం కార్మికులపై పడటంతో 8 మంది మృతి చెందారు.