భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీరాజా మరణవార్త తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. చెన్నైలోని దర్శకుడి నివాసానికి చేరుకున్న సీఎం విజయ్, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన గాఢ సానుభూతిని తెలియజేశారు.