విశాఖపట్నంలో మృతురాలిని జోడుగుళ్లపాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీ రాత్రి బర్త్‌డే పార్టీకి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. తెల్లవారుజామున జెస్సీని మెడికవర్ ఆసుపత్రిలో చేర్చామని ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకునేసరికి ఆమె అప్పటికే మృతిచెందినట్లు తెలిసింది. బర్త్‌డే పార్టీలో జరిగిన వివాదమే జెస్సీ మృతికి కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఆమెను స్నేహితులే కొట్టి చంపారని వారు ఆరోపిస్తున్నారు.

