గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలో నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్‌ను కలిగి ఉన్న నలుగురు యువకులను తెనాలి త్రీ టౌన్ పోలీసులు మరియు ఈగల్ టీం సంయుక్తంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రహస్యంగా తెనాలికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 5 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

