న్యూజిలాండ్తో జరుగుతున్న నాలుగో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. భారత్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ తొలి బంతికే పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ మాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ వికెట్ పడిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హెన్రీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.