కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ వద్ద బుధవారం ఉదయం 6 గంటలకు నమోదు అయిన సమాచారం ప్రకారం జలాశయంలో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 242 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అంతే పరిమాణంలో (242 క్యూసెక్కులు) బయటకు వెళ్తుంది. నది ద్వారా 242 క్యూసెక్కులు వస్తుండగా.. ఎమ్ఎన్ఆర్ (MMR), చెక్ డ్యామ్ (CR@144) ల నుండి ఇన్ఫ్లో సున్నాగా నమోదైంది. అవుట్ (242 క్యూసెక్కులు).. మిషన్ భగీరథ ద్వారా 143 క్యూసెక్కులు, ఆవిరి నష్టాల రూపంలో 99 క్యూసెక్కులు పోవుచున్నాయి.