లా విద్యార్థులపై చర్యలు తీసుకునే చట్టబద్ధమైన అధికారం బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారు విద్యార్థులు అని, వారంతా సంబంధిత యూనివర్సిటీలు, విద్యా సంస్థల పరిధిలోని వస్తారని వెల్లడించింది. ఇటీవల నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల అంశంలో చెలరేగిన వివాదంపై విచారణ సందర్భంగా కోర్టు తాజా సూచనలు చేసింది. వారు విద్యార్థులు అని, వారిపై చర్యలు తీసుకునే హక్కు సంబందిత యూనివర్సిటీలకే ఉంటుందని పేర్కొంది.