బోస్టన్ యూనివర్సిటీలో దీప్కే పట్టభద్రుడైనట్లు రికార్డు దొరకలేదని పాడ్‌కాస్టర్ ప్రఖర్ గుప్తా చెప్పడంతో బోస్టన్ విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో తాను ఉన్నట్లుగా కనిపిస్తున్న ఒక వీడియోను ఆయన షేర్ చేశారు. ఆ వీడియో BU COM గ్రాడ్ స్టూడెంట్ కౌన్సిల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పోస్ట్ చేసిన స్టోరీ స్క్రీన్ రికార్డింగ్. తద్వారా తాను చదువుకున్న రోజుల్ని దిప్కే మరోసారి గుర్తుచేసారు. ఈవెంట్లకు గుప్తా స్నేహితులను ఆహ్వానించకపోవడం తన తప్పు కాదంటూ దిప్కే చురకలు అంటించారు.