మంత్రి కొండా సురేఖకు డాటర్ స్ట్రోక్ తగిలింది. కూతురు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. స్వయంగా ఆమె వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని ఏఐసీసీ ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చింది. క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీచేశారు.