కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. పడిపోతుందో తెలియట్లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. కొండా సురేఖను సస్సెండ్ చేయాలని అగ్రనేతలు ఢిల్లీలో కూర్చున్నారని అన్నారు. రాజాసింగ్ కొండా సురేఖ విషయంపై రాజాసింగ్ స్పందించారు. ప్రభుత్వం అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నందున అవినీతి చేస్తున్నారని, డబ్బుల లొల్లి కొండా సురేఖ రాజీనామా వరకు వచ్చిందని రాజా సింగ్ ఆరోపణలు చేశారు. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తామని అధిష్టానం చెప్పిందటని రాజా సింగ్ పేర్కొన్నారు.