మధ్యప్రదేశ్‌లోని ‘అజ్నార్’ నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ కుప్పలను, విషపూరితమైన చెత్తను తానొక్కడే చేతులతో తీసిపారేస్తూ నెట్టింట కొత్త ప్రభంజనాన్ని సృష్టించాడు. అతని పేరు బిట్టూ తబాహి! ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక కుర్రాడు టరిగా భుజాన వేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. బిట్టూ చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, పౌరుల నుంచి ఆక్రోశం వెల్లువెత్తుతోంది.