ఓ లారీ డ్రైవర్ పై రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ దాడికి దిగిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది.
రవాణా శాఖ తనిఖీ సమయంలో షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద ఓ లారీ డ్రైవర్ వాహనం నిలుపలేదు. దీంతో లారీని ఓవర్ టెక్ చేసి బ్రేక్ ఇన్ స్పెక్టర్ ఆపారు. అనంతరం బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలోనే ఆమె డ్రైవర్ లారీ ఎక్కి.. లారీ డ్రైవర్ పై దాడికి దిగాడు. లారీ డ్రైవర్ నోటి నుంచి రక్తం వచ్చేలా కొట్టాడు. ఈ ఘటన నేపథ్యంలో ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధమయ్యారు.