ఇటలీలోని ప్రసిద్ధ ఫోర్లీ ఎయిర్‌పోర్ట్ లో సంభవించిన బీభత్సమైన ఈదురుగాలులతో కూడిన తుఫాను విమానాశ్రయాన్ని వణికించింది. గాలుల ధాటికి అక్కడ నిలిపి ఉంచిన విమానాలు రన్‌వేపై గాల్లోకి లేచి బోల్తా పడిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫోర్లీ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు దాదాపు 120 కిలోమీటర్లకు చేరి ఊహించని తుఫాను ధాటికి ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన అనేక చిన్న తరహా విమానాలు కాగితపు పడవల లాగా గాల్లో తేలి, రన్‌వేపై తలకిందులుగా పడిపోయాయి.