ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే అమలు కానుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్లపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే సింగిల్ లేన్ రూట్ అప్‌డేట్ అయింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం 450 మంది సిబ్బంది మోహరించనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్ వే అమలులో ఉంటుంది. వాహనదారులు ఏర్పాటు చేసిన సైనేజ్ బోర్డులను గమనించి, నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే లేన్ మారాలి. నిర్ణీత మార్గాలు, ఫ్రీ-లెఫ్ట్ సదుపాయాలను వినియోగించుకోవాలి.