ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.తనను తాను ‘దిమాగీ నక్సల్’గా ఆయన అభివర్ణించుకున్నారు. ఇందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు. తాను నిజమైన దేశభక్తుడిని, బీజేపీకి భయపడనని పేర్కొన్నారు. బీజేపీకి భయపడని వారు మోడీ దృష్టిలో దిమాగీ నక్సల్స్ అని, భగత్ సింగ్, బీఆర్ అంబేడ్కర్ ఈరోజు జీవించి ఉంటే ప్రధాని నిర్వచనం ప్రకారం వారిని కూడీ దిమాగీ నక్సల్స్ అని పిలిచేవారని అన్నారు.