అల్లూరి జిల్లాలో గంజాయి ముఠా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్లతోదాడి చేశారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. చింతపల్లి మండలం లోతుగెడ్డ సమీపంలో ముందస్తు సమాచారంతో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా.. అందులో ఉన్న ముఠా సభ్యులు, హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో..
నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.