టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి పవన్ అభిమానులు, జన సైనికులకు రాహుల్ టార్గెట్ అయ్యారు. నెట్టింట అతనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అయితే రాహుల్ ఆ పోస్టులన్నీ డిలీట్ తెలుస్తోంది. ప్రశ్నించినంత మాత్రాన తాను దేశద్రోహిని కానంటూ మరో ట్వీట్ చేశారు. ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేనెళ్లిపోతా’ అంటూ తన డైలాగ్ తో ఫన్నీ పోస్ట్ పెట్టారు.

