భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని ప్రపంచానికి చాటిచెప్పడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, వీరంతా తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వస్తుంటే విమర్శించడం నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ తమను ఓడించి ప్రధాని అవుతారనే భయంతోనే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని, కడుపులో విషం ఉంటే అది తెలంగాణ ప్రజలపై ప్రదర్శించవద్దని హితవు పలికారు.