దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దేశీయంగా అక్టోబర్ నెల రిటెయిల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి మించి నమోదు కావడంతో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. వరుస లాభాల వేళ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమూ ప్రభావం చూపింది. సెన్సెక్స్ ఉదయం 81,833.78 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,911.01) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది.