క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్‌లకు అందించే జాతీయ క్రీడా పురస్కారాలు–2025 ప్రదానోత్సవం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు అందజేసి సత్కరించారు. డెకాథ్లాన్ అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ సహా మొత్తం 15 మంది అర్జున అవార్డులను అందుకున్నారు. వివిధ క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను ప్రదానం చేశారు.

