అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ కాలేజ్ ట్రావెలర్‌ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. 35 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న ట్రావెలర్‌ను వేగంగా వచ్చిన KA01AT0977 నంబర్ గల ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ట్రావెలర్‌లో 35 మంది విద్యార్థులతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో కోహోరా మోడల్ ఆసుపత్రికి తరలించారు.