ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లును ఆమోదించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం తెలిపారు. అసమ్మతి వ్యక్తం చేస్తున్న వారి గొంతు నొక్కేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. “మాట్లాడాలనుకునే లేదా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకునే ఎవరినైనా అణచివేసి, నోరు మూయిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇది జరగడం మనం చూస్తున్నాం,” అని ఆమె అన్నారు.