స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ఎంతో ముఖ్యమైందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. స్వచ్ఛాంద్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ కష్టాలు అన్నింటినీ అధిగమిస్తున్నామని అన్నారు. స్వచ్ఛాంధ్ర అంటే చెత్తను శుభ్రం చేయడమే కాదని ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని సూచించారు. పిల్లలు భారం కాదని వాళ్లే మన సంపదని, మూడో బిడ్డను పుట్టిన వెంటనే రూ. 30 వేలు ఇస్తామని, నాలుగో బిడ్డ పుట్టిన వెంటనే రూ.40 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.