ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో గంజాయి అంశం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. నగరంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మహిళా విభాగాలు పరస్పర ఆరోపణలతో వీధులకెక్కాయి. ఇరు వర్గాలు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో తిరుపతిలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే నగరంలో గంజాయి అక్రమాలు, శాంతిభద్రతల సమస్యలు పెరిగాయని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపించారు.