బీహార్‌లోని షాహ్‌పూర్ పట్టోరి రైల్వే స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఇద్దరు పిల్లలను తీసుకుని పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా రైలు రావడంతో ప్లాట్‌ఫారమ్ పైకి వెళ్లే దారి లేక, ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను వెంటనే పట్టాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పడుకోబెట్టి, వారిని కవచంలా అల్లేసింది. రైలు వేగంగా వారి మీదుగా దూసుకెళ్తున్నంత సేపు ప్లాట్‌ఫారమ్‌పై ఉన్నవారంతా ఏం జరుగుతుందోనని భయంతో కళ్లు మూసుకున్నారు. రైలు వెళ్లిన తర్వాత చూస్తే.. తల్లి ఒంటిపై గాయాలైనప్పటికీ, పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారు.